ఆ కాల్స్‌తో జాగత్త్ర !
చేతిలో సెల్‌ఫోన్ ఎంత సదుపాయమో అంత ప్రమాదకరం కూడా! కొన్ని సైట్లు, వాట్సాపులో వచ్చే కొన్ని లింకులను ఓపెన్ చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. కొందరు సైబర్ క్రిమినల్స్ పంపే సైట్లలోని లింకులతో బహుపరాక్. ఇటీవల కాలంలో ఫోన్ ద్వారా ట్యాపింగ్‌కు గురై మోసపోతున్న వారే ఎక్కువ. తెలియని లింకులను ఓపెన్‌చేస్తే బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము ఖాళీ అవుతుంది. ఒక్కోసారి ఆకస్మికంగా వచ్చే న్యూడ్ వీడియో ఫోన్స్‌కాల్స్‌తో పెను ప్రమాదం పొంచివుంది. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
సైబర్ నేరముఠాలు కొన్ని ఒక పథకం ప్రకారం కొందరిని టార్గెట్‌గా చేసుకొని, మోసానికి తెగిస్తున్నాయి. దీనిలో భాగంగా రాత్రివేళల్లో గుర్తుతెలియని అమ్మాయిల నుంచి వీడియో కాల్స్ వస్తుంటాయి. అదేంటో చూద్దామని కాల్‌లిఫ్ట్ చేస్తే ఈ పన్నాగంలో ఇరుక్కున్నట్టే! కాల్‌చేసిన అమ్మాయి తీయగా మాట్లాడుతూ, మీ నుంచి స్నేహాన్ని ఆశిస్తున్నట్టు చెబుతుంది. నెమ్మదిగా మాటల్లో దించి, చనువుగా ప్రవర్తిస్తుంది. ఇటు నుంచి ఆ విధంగా ప్రవర్తించేలా చూసి. ఆ మొత్తం వీడియో కాల్‌ని రికార్డు చేస్తారు. ఆమెతో న్యూడ్ వీడియో చేసినట్టు వీడియో క్రియేట్ చేస్తారు. దాన్ని మాట్లాడిన వ్యక్తికి వెంటనే పంపించేస్తారు. ఇంతలోనే ఆ వీడియో పంపిన మహిళ నుంచి మెసేజ్ కూడా వస్తుంది. వెంటనే డబ్బులు కావాలనే డిమాండ్లు వరుసగా వస్తుంటాయి. లేదంటే ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆ వీడియో షేర్ చేస్తామంటూ బెదిరిస్తారు. ఫ్రెండ్స్‌కు కూడా పంపుతామంటారు. అలా పంపకుండా ఉండాలి అంటే డబ్బు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తారు. కొందరు వెంటనే వాళ్లకు డబ్బు పంపించి ఆ సమస్య నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తారు. ఇంకొందరు ఏమి చేయాలో అర్థంకాక కుమిలిపోతుంటే మరో నంబరు నుంచి కాల్ వస్తుంది. తాము సిబిఐ అధికారులమనీ, మీ వీడియో యూట్యూబ్‌లో వచ్చిందని, వెంటనే డబ్బులు ఇచ్చి డిలీట్ చేయించుకోవాలని బెదిరిస్తారు. ఇదంతా ఒక విష వలయంలా సాగుతూ ఉంటుంది. దీని గురించి ఎవరికీ చెప్పుకోలేక, సమస్య నుంచి బయటపడలేక సతమతం అవుతారు. వారి వేధింపులు తట్టుకోలేక కొందరు డబ్బులు ముట్టజెబుతుంటారు. మరీ తీవ్రత ఎక్కువైతే అప్పుడు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తుంటారు.
మహిళలే టార్గెట్‌గా…
కొందరు నేరగాళ్లు అమ్మాయిలను టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. ఫొటోలు మార్ఫ్‌చేసి..బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తామంటూ వేలు, రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. సైబర్ నేరస్తులు కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ మహిళలను బెదిరిస్తున్నారు. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో బాగా పెరిగాయి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలో కొందరు అమ్మాయిలను, మహిళలను పరిచయం చేసుకొని, కొన్నాళ్లు వారితో చాటింగ్ చేస్తారు. పర్సనల్ డేటా పూర్తిగా తెలుసుకుంటారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్ల నుంచి అమ్మాయిల ఫొటోలు తీసుకొని వాటిని మార్ఫ్ చేసి మాయ చేస్తున్నారు. వారితో నమ్మకంగా ఉంటూనే పర్సనల్ ఫొటోలను సేకరిస్తుంటారు. ఆ తర్వాత వేరే నంబర్ల నుంచి ఫోన్లు చేసి సిబిఐ, కస్టమ్స్, ఐటి, జీఎస్టీ అధికారుల పేర్లతో బెదిరిస్తుంటారు. మరికొందరు సోషల్‌మీడియాలో అమ్మాయిల ప్రొఫైల్ సెర్చ్‌చేసి వాళ్ల ఫోన్‌నంబర్లు సేకరించి బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. మార్ఫింగ్ ఫొటోలు వాట్సాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు.
డేటింగ్ సైట్లతో జాగ్రత్త
సామాన్య ప్రజలు మొదలుకొని, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వరకూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న ఉదంతాలు ఉన్నాయి. డేటింగ్ సైట్లలో అందమైన ప్రొఫైల్ ఫొటోలకు ఆకర్షితులై లైక్‌లు, వీడియోలు చేస్తే జీవితాలు దుర్భరంగా మారిపోతాయి. కేటుగాళ్ల ఊబిలోకి కూరుకుపోవటం ఖాయం. మరికొందరు పేరు, ఫోన్ నంబర్లు సేకరించి ఉదయం, రాత్రిళ్లు హారు, బై అంటూ మెసేజ్‌లు పెట్టి ముగ్గులోకి దించుతారు. అశ్లీల వీడియోలు పెడుతుంటారు. ఎవరైనా వారికి అనుకూలంగా మెసేజ్ పెట్టినా, ఎస్ఎంఎస్‌లు కంటిన్యూ చేసినా రికార్డు చేసుకుని ఆ తర్వాత బెదిరిస్తుంటారు. కొన్నిసార్లు మహిళలు మహిళలతో స్నేహం చేస్తూ, ఫొటోలు సేకరిస్తారు. అర్ధనగ వీడియోలు చేసి పంపించేలా ప్రేరేపిస్తారు. తీరా అలాచేస్తే అప్పటి నుంచి అసలు వ్యక్తులు బయటకు వచ్చి బెదిరింపులకు దిగుతుంటారు. డబ్బులివ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తామంటారు. ఇలాంటి కేసులు కూడా అనేకం సైబర్ పోలీసులకు వస్తున్నాయి. అపరిచిత వ్యక్తులతో మాట్లాడకుండా ఉండటమే ఉత్తమ మార్గం. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండాలి. పదే పదే అవాంఛిత వీడియోలు, కాల్స్ మీ మొబైల్‌కి వస్తున్నాయి అంటే- మీ నెంబరు వారి టార్గెట్లో ఉన్నట్టు లెక్క. రెస్పాండు కాకుండా ఆ సైట్‌ని లేదా వారి మొబైల్ నెంబరును బ్లాక్ చేయండి.
ధైర్యంగా ఫిర్యాదు చేయండి
ఎవరైనా మహిళలు తమ ఫొటోలు మార్ఫింగ్‌నకు గురైతే భయపడాల్సిన పనిలేదు. అలాంటి ఫొటోలు సోషల్‌మీడియాలో పెట్టినా, పెడతామని బెదిరించినా సైబర్ క్రైం పోలీసులకు 1930 ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. లేదా షషష.ర్‌శీజూఅషఱఱ.శీతీస్త్ర ద్వారా న్యూడ్ చేసినా పిక్చర్, ఒరిజినల్‌ది అప్‌డేట్ చేయాలి. ఈ సైట్ పూర్తిగా భద్రతాపరమైంది. ఈ సంస్థ అవాంఛిత ఫొటోలలను సైట్ నుంచి పూర్తిగా తొలగిస్తుంది. ఎలాంటి వివరాలను బయటకు వెల్లడించదు.
అపరిచిత వ్యక్తులతో అప్రమత్తం : ఆవుల శ్రీనివాసరావు, డిఎస్‌పి,రేపల్లె, బాపట్ల జిల్లా.
ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త ఎత్తుగడలతో నేరాలకు పాల్పడుతున్నారు. డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్, పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఆశలు చూపుతున్నారు. ఐవిఆర్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) కాల్స్ ద్వారా ఎరవేస్తారు జాగ్రత్త. బ్యాంకుల నుంచి వచ్చే రికార్డు వాయిస్‌లకు స్పందించకూడదు. పార్శిళ్లు వచ్చాయనీ, అందులో డ్రగ్స్, ఆయుధాలు ఉన్నాయంటూ వచ్చే ఫోన్లకు స్పందించొద్దు. లోన్ ఇస్తామని చెప్పే లోన్ యాప్‌లను నమ్మొద్దు. పార్ట్‌టైమ్, వర్క్‌ఫ్రం హోమ్ అంటూ ప్రొడక్ట్స్, హోటళ్లకు లేటింగ్, లైక్స్ ఇవ్వటం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పే యాప్స్, వెబ్‌సైట్లు మోసపూరితం. వాటిని నమ్మి మోసపోవద్దు. తరచుగా వాడుతున్న పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి.
– సైబర్ నేరం జరిగిన వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి.
policestation/ https:// cyber crime.gov.inలో రిపోర్టు చేయాలి.