ఇండ్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి.

అర్హులైన వారందరికీ వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్ ఇవ్వాలి.

కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.

సిపిఎం సిద్దిపేట అర్బన్ మండల కార్యదర్శి చొప్పరి రవికుమార్

సిద్దిపేట ఆగస్టు 6 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట అర్బన్:- ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అర్హులైన వారందరికీ కొత్తగా వితంతు వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ ఇవ్వాలి, కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలని సిపిఎం సిద్దిపేట అర్బన్ మండల కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున సిద్దిపేట అర్బన్ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇండ్ల స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇస్తామని ఇంటి స్థలం ఉన్న వారికి మూడు లక్షల ఇంటి నిర్మాణానికి చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నారని కానీ ఆ హామీ అమలు కోసం బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు పేదలను మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని అన్నారు ఇల్లు లేని నిరుపేదల పట్ల చిత్తశుద్ధి ఉంటే మొన్నటి బడ్జెట్లో నిధులు కేటాయించేవారని కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం వల్ల ఇందిర ఇండ్లు వస్తాయా అని నిరాశతో ప్రజలు ఉన్నారు అన్నారు. అలాగే పెన్షన్లు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారు కానీ కొత్త పెన్షన్లు పూసే ఎత్తలేదని ఇప్పటికే వితంతువులు వికలాంగులు వృద్ధాప్యం చెందినవారు వందల సంఖ్యలో ఉన్నారని వారందని గుర్తించి వారికి పెన్షన్ అదే విధంగా చూడాలన్నారు. గత ప్రభుత్వం పది సంవత్సరాలు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదని దానితో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత ఉన్నా కూడా సంక్షేమ ఫలాలకు నోచుకోకపోవడం దారుణం వెంటనే కొత్త రేషన్ కార్డులకు కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఇల్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పెన్షన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అభిషేక్, దండు లక్ష్మి, మంజుల, సుజాత, రజిని, లక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now