*జయశంకర్ గద్దర్ చిత్రాలను చిత్రించి ఘన నివాళులు*
*అర్పించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు*
సిద్దిపేట ఆగస్టు 6 ప్రశ్న ఆయుధం :
ప్రొఫెసర్ జయశంకర్ సార్ 90వ జయంతిని పురస్కరించుకొని జయశంకర్ చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద అద్భుతంగా చిత్రించారు, అలాగే గద్దర్ వర్ధంతి సందర్భంగా అవాలతో అద్భుతంగా గద్దర్ చిత్రాన్ని చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ఉద్ద నౌక గద్దర్ గారు ఎందరో గాయకులను తయారు చేసిన మహా వ్యక్తి గద్దర్ అని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన వ్యక్తి. సూర్యచంద్రులు ఉన్నంతవరకు తెలంగాణ సమాజం మర్చిపోదు అని ఘన నివాళి అర్పించారు.