Headlines in Telugu
-
అదనపు కలెక్టర్ మంచు నగేష్ ను కాంగ్రెస్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం
-
మెదక్ జిల్లాలో అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మంచు నగేష్ కి పుష్పగుచ్చం
-
కాంగ్రెస్ పార్టీ నాయకులు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని అదనపు కలెక్టర్ ని కోరారు
-
ప్రజా పాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ ను కోరిన కాంగ్రెస్ నేతలు
-
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయమాటలు చెప్తున్న ప్రభుత్వంపై విమర్శలు
మెదక్ జిల్లా కేంద్రానికి తిరిగి వచ్చిన అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన మంచు నగేష్ కి కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించా రు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడు తూ ఇంతకు ముందు మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసి బదిలీగా వెళ్ళిపోయి తిరిగి మళ్లీ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యత లు స్వీకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ వారికి అందేలా చేయాలని వారు అన్నారు.అలాగే రైతులకు ఇస్తున్నటువంటి బోనస్ అర్హులైన రైతులందరికి అందేలా చూడాలని అదనపు కలెక్టర్ ని కోరారు.అలాగే ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలందరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేసే దిశగా చూడాలని అదనపు కలెక్టర్ ని కోరారు.గత ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేసింద న్నారు.కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ అందే దిశగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రజలకు తెలిసే విధంగా సభలు ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్తున్నారన్నారు. గత ప్రభుత్వం దోచుకుని దాచుకున్నారు.అదేవిధంగా విధంగా వారి కుటుంబం ఆస్తులను దక్కించు కోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు.కానీ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు అన్నిటిని బిఆర్ఎస్ పార్టీ మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజకీయ నాయకులు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకు న్నారు.కానీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని వారు అన్నారు.ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ గిద్ద కింది ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాడి రమేష్, భూపతి యాదవ్,తదితరులు పాల్గొన్నారు.