*ఝులాన్ గోస్వామికి అరుదైన గౌరవం…*
భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ ఝులాన్ గోస్వామికి అరుదైన గౌరవం దక్కనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలోని ఓ స్టాండ్‌కు ఆమె పేరు పెట్టనున్నారు. దీంతో, ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో ఈ తరహా గౌరవం అందుకున్న మూడో క్రికెటర్‌గా, మొదటి మహిళగా గోస్వామి చరిత్ర సృష్టించనుంది. కాగా, ఇప్పటివరకూ ఈడెన్ గార్డెన్స్‌లో సౌరభ్ గంగూలీ, దివంగత పంకజ్ రాయ్‌ల పేర్లతో మాత్రమే స్టాండ్స్ ఉన్నాయి.