పెద్దిరెడ్డికి షాక్ జనసేన పార్టీకే పీఏసీ చైర్మన్ పవన్ ఛాయిస్ పులవర్తి

*పెద్దిరెడ్డికి షాక్ జనసేన పార్టీకే పీఏసీ చైర్మన్ పవన్ ఛాయిస్ పులవర్తి*

పిఏసీ ఛైర్మన్ ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షానికి దక్కే పీఏసీ ఛైర్మన్ పదవి ఈ సారి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు దక్కనుంది.

వైసీపీకి సభ లో సంఖ్యా బలం లేకపోవటంతో జనసేనకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు పేరు పవన్ సూచించారు. ఇక, ఆయన పేరు ప్రకటన లాంఛనంగానే కనిపిస్తోంది.

కీలక పరిణామాలు

అసెంబ్లీ వేదికగా పీఏసీ ఎన్నిక లో అనేక అనూహ్య మలుపులు చోటు చేసుకున్నాయి. ఈ పదవి వాస్తవంగా ప్రతిపక్షానికి ఇవ్వటం ఆనవాయితీ. అయితే, ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కలేదు. సభలో కనీసం 18 మంది ఉంటేనే ఈ హోదా దక్కనుంది. అదే విధంగా పీఏసీ సభ్యుల ఎన్నిక కోసం ఈ రోజు నామినేషన్లు స్వీకరించారు. వైసీపీ నుంచి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మండలి నుంచి మరో ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసారు. ఒక దశలో ఆనవాయితీ ప్రకారం వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా.. ఆ పార్టీకే పీఏసీ ఇస్తారనే వాదన వినిపించింది.

వైసీపీకి నో ఛాన్స్

కానీ, అనూహ్యంగా చివరి నిమిషంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మొత్తం సభ్యుల స్థానాలకు కూటమి నుంచి మొత్తం 12 స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్ల పైన ఓటింగ్ జరగనుంది. శాసనసభ నుంచి వైసీపీ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసిన పెద్దిరెడ్డికి స్థానం దక్కే అవకాశం లేదు. శాసన మండలిలో వైసీపీకి బలం ఉండటంతో అక్కడ నుంచి ఇద్దరికి పీఏసీ కమిటీలో స్థానం దక్కే ఛాన్స్ ఉంది. అయితే, పీఏసీ ఛైర్మన్ అయ్యే వ్యక్తి ఎమ్మెల్యే అయి ఉండాలి అనే నిబంధనతో వైసీపీకీ పీఏసీ ఛైర్మన్ పదవి దాదాపు లేదనే తెలుస్తోంది. దీంతో, కూటమిలో ఒప్పందంలో భాగంగా ఈ పదవి జనసేనకు కేటాయించనున్నారు.

పవన్ ఛాయిస్ రామాంజనేయులు

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు టీడీపీ తీసుకోవటంతో…పీఏసీ ఛైర్మన్ పదవి జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ పదవికి జనసేన నుంచి పవన్ సూచించిన వారికి పదవి ఇచ్చేలా చంద్రబాబు సమాచారం ఇచ్చారు. తొలుత మాజీ మంత్రి కొణతాల పేరు తెర మీదకు వచ్చింది. అయితే, స్పీకర్ అదే జిల్లా వారు కావటంతో.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరు పవన్ సూచించారు. దీంతో, పీఏసీ ఛైర్మన్ గా రామాంజనేయులు ఎంపిక లాంఛనంగా మారింది. గతంలో టీడీపీ నుంచి పని చేసిన రామాంజనేయులు తాజా ఎన్నికల్లో జనసేన నుంచి గెలుపొందారు.

Join WhatsApp

Join Now

Leave a Comment