ఎమ్మార్వో ఆఫీస్ వద్ద NPRD ధర్నా

NPRD
Headlines
  1. ఎంప్లాయ్‌మెంట్ హామీలపై NPRD ఆందోళన
  2. సాలూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా – హక్కుల కోసం పోరాటం
  3. వికలాంగులు, బీడీ కార్మికుల డిమాండ్లపై NPRD ఉద్యమం
  4. రాష్ట్ర హామీలు నెరవేర్చండి: NPRD నాయకుల వినతి
  5. నవంబర్ 25న బోధన్ ఆర్డీఓ ఆఫీస్ వద్ద పెద్దఎత్తున ధర్నా

నిజామబాద్ జిల్లా NPRD కమిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు సాలూరు మండలం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎమ్మార్వో కి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. కుమ్మంపల్లి గ్రామపంచాయతీ ముందు ధర్నా చేసి గ్రామపంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాలంపడు గ్రామపంచాయతీ ముందు ధర్నా చేసి కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి జిల్లా కార్యదర్శి యే షాల గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వాలి, వితంతువులకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు 4000 పెన్షన్ ఇవ్వాలి, అదేవిధంగా కొత్తగా దరఖాస్తు పెట్టిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలి అని కోరారు. ఇంటి స్థలాలు రేషన్ కార్డులో అంథోదయ కార్డులు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలి అని కోరారు.

నవంబర్ 25వ తేదీ సోమవారం నాడు బోధన పట్టణంలోని ఆర్డిఓ ఆఫీస్ సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉదయం పదిగంటల నుంచి ధర్నా నిర్వహించటం జరుగుతుంది దీనికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు, బీడీ కార్మికులు, వితంతువులు, వృద్ధులు, పెన్షన్ వచ్చే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ధర్నాను జయప్రదం చేయవసిందిగా కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా తమకు హక్కుగా వచ్చే పెన్షన్ ని సాధించుకోవాలని పిలుపు ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గైని రాములు, జిల్లా కోశాధికారి రామ్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్, జిల్లా సహాయ కార్యదర్శి ముంజం సాయిలు, జిల్లా ఉపాధ్యక్షురాలు తోకల నాగలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి గిజ్జ ఎల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిరిగిరి దేవదాస్, లక్ష్మి, హైమాది బేగం, సుల్తానా బేగం, లక్ష్మి, గంగమని, వీరమని, నర్సవ్వ, పోషవ్వ, లతా తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now