సర్వే డేటా ఎంట్రీ కీలకమైనది::రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

సర్వే డేటా
Headlines
  1. సమగ్ర ఇంటింటి సర్వే చివరి దశలోకి
  2. డేటా ఎంట్రీలో పొరపాట్లకు తావు లేకుండా చర్యలు
  3. డోర్ లాక్, వలస వివరాల సేకరణకు స్పష్టమైన మార్గదర్శకాలు
  4. ఫుడ్ పాయిజన్ నివారణకు ప్రత్యేక చర్యలు: భట్టి విక్రమార్క
  5. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు ఉప ముఖ్యమంత్రి సూచనలు
*సర్వే డేటా ఎంట్రీ కీలకమైనది::రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు*

డోర్ లాక్, వలస వెళ్ళిన వారి వివరాలు ఫోన్ కాల్ ద్వారా సేకరించాలి*

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి*

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా *ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ,* సర్వే డేటా ఎంట్రీ లో నాణ్యత చాలా ముఖ్యమైందని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తేయి కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమ బద్ధకరించుకోవాలని, వారిని అందుబాటులో ఉండమని కోరాలని ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాలని తెలిపారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని, ఈ పాఠశాలలో ఆహారం, పరిశుభ్రత పై ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యావత్ క్యాబినెట్ ప్రత్యేక దృష్టికి సాధించిందని, అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు తలెత్తకూడదనే మెస్, కాస్మోటిక్స్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.  

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి *కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్* పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now