కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ కు గజమాలతో సన్మానం

*నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ కి గజమాలతో ఘన సన్మానం*
*ఏఎంసీ డైరెక్టర్ ఉప్పుల శ్రీనివాసరెడ్డి*

*ఇల్లందకుంట నవంబర్ 24 ప్రశ్న ఆయుధం::-*

ఉత్తర తెలంగాణలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరుపొందిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతనంగా నియామకమైన ఇల్లందకుంట మండలం లక్ష్మాజి పల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శ్రీనివాస రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిని గజమాలతో సత్కరించి శాలువాతో సన్మానం చేశారు ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని రైతు సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ పథకాలను గ్రామ గ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలని నూతనంగా ఎన్నిక కాబడిన డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో ప్రణవ్ సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంగిలే రామారావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోడిశాల పరమేష్ సింగిరెడ్డి గోపాల్ రెడ్డి మూడెత్తుల మల్లేష్ ఎడ్ల కిషన్ రెడ్డి ఉప్పుల అమరేందర్ రెడ్డి మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి లాల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now