– ట్రాన్స్ఫార్మర్ దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు…

– ట్రాన్స్ఫార్మర్ దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు…

– జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో నిందితులపై కేసులు..

– నలుగురు నిందితులు రిమాండ్ కు తరలింపు..

– గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి

గత కొద్ది రోజులుగా ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ , ఆయిల్ దొంగతనం చేస్తూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదైన నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను రాయపోల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగిందని గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి అన్నారు. ఆదివారం రాయపోల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయపోల్ పోలీసులు రామారం గ్రామ శివారులో ఉదయం తెల్లవారుజామున 4:00 గంటల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా గ్రామాలకు దూరంగా వ్యవసాయ పొలాలు, రోడ్డు పక్కన ఉండే ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాయిల్స్, ఆయిల్ దొంగతనం చేస్తారని నేరాలు ఒప్పుకోవడం జరిగింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా నిందితులు గతంలో బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నేరాలు, గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నేరాలు, రాయపోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నేరాలు, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నేరాలు, జగదేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు నేరాలు, దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నేరాలు, కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నేరం, ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నేరం నమోదయ్యాయి. ట్రాన్స్ ఫర్మర్ ధ్వంసం చేయడానికి గడ్డపార, పానాలు వారి కారులో లభించాయి.ఈ నలుగురు నిందితులపై గతంలో చేగుంట మండలం మైసపేట గ్రామ శివారులో ఉన్న చైతన్య ఇండస్ట్రీస్ వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగతనం చేసిన కేసులో చేగుంట పోలీసులు అక్టోబర్ 3 న అరెస్టు చేసి జైలుకు పంపించగా అక్టోబర్ 11న జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైనప్పటి నుంచి మళ్లీ ఇదే దొంగతనం చేస్తున్నారు. ఇట్టి నేరాలలో దొంగలించిన ఆయిల్, కాయిల్స్ ను తూప్రాన్ పట్టణంలోని ఆదేశ్ అనే వ్యక్తికి అమ్ముతామని తెలిపారు. ప్రస్తుతం ఆదేశ్ పరారీలో ఉన్నారు. నలుగురు నిందితులు జెసిపి డ్రైవర్ లుగా పనిచేస్తూ ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. నిందితులు హర్యానా రాష్ట్రం మేవాట్ జిల్లా బందాస్ మండల కేంద్రానికి చెందిన జుబేర్ ఖాన్, రాజస్థాన్ రాష్ట్రం భారత్ పూర్ జిల్లా జుర్హార గ్రామానికి చెందిన ఫజర్, రాజస్థాన్ రాష్ట్రం భరత్ పూర్ జిల్లా జుర్హార గ్రామానికి చెందిన జాహిద్, హర్యానా రాష్ట్రం ముళాయి జిల్లా పల్వాల్ మండలం టొంక గ్రామానికి చెందిన ఇర్షద్. ఈ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక గడ్డపార, రెండు పానాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.అలాగే ఈ కేస్ చేధనలో కృషిచేసిన తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్సై రఘుపతి, కుకనూరుపల్లి ఎస్సై శ్రీనివాస్, జగదేపూర్ ఎస్సై చంద్రమోహన్, బేగంపేట ఏఎస్సై అమృత్, కుకునూరు పల్లి కానిస్టేబుల్ రమేష్, బేగంపేట కానిస్టేబుల్లు కనకరాజు, సత్యనారాయణ, రాయపోల్ కానిస్టేబుల్లు స్వామి,సోమయ్య, సిద్దిపేట ఐటి సెల్ శ్రీకాంత్ వీళ్లను సిద్దిపేట సిపి అనురాధ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. ఇదే తరహాలో నేర పరిశోధనలో నిరంతరం కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తొగుట సిఐ షేక్ లతీఫ్,రాయపోల్ ఎస్సై విక్కుర్తి రఘుపతి, బేగంపేట ఏఎస్ఐ అమృత్, పోలీస్ సిబ్బంది మధుసూదన్ రెడ్డి, స్వామి, సత్యనారాయణ, సోమయ్య, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now