నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ నవంబర్ 25:
నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో గల న్యాలకల్ చెరువు వద్ద కూతురుతో సహా తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన జరిగింది.
మోపాల్ మండల ఎస్ఐ యాదిగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం తండ్రి రఘుపతి క్రాంతి (30), అతని కూతురు నేహాశ్రీ (18 నెలలు)తో సహా న్యాలకల్ చెరువులో ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాల పై వివరిస్తూ… చిన్నారి నేహాశ్రీకు మెదడు సంబంధిత సమస్యలు ఉన్న కారణంగా గతంలో రెండు సార్లు శస్త్రచికిత్సలు చేయించగా వాటికి ఫలితాలు ఏమి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా పెరిగి తండ్రి రఘుపతి క్రాంతి మనస్తాపానికి గురై సోమవారం తెల్లవారుజామున ఇంద్రపూర్ కాలనీలోని అతని నివాసం నుండి బైక్ పై న్యాలకల్ చెరువు వద్దకు వెళ్లి తన బైకును చెరువు వద్ద నిలిపి ఈ ఘోరమైన చర్యకు పాల్పడ్డారాని క్రాంతి ధర్మారం గురుకుల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేసేవాడిని తెలిపారు.