పాఠశాలను అకస్మిక తనిఖీలు చేసిన ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ రెడ్డి 

ప్రాథమిక పాఠశాలను అకస్మిక తనిఖీలు చేసిన ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి

నగల్ గిద్ద మండల పరిధిలోని సక్రు నాయక్ తండ లో గల ప్రాథమిక పాఠశాలను ఆకాస్మిక తనిఖీలు చేసిన శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

అనంతరం ఎమ్మెల్యే  పాటశాల లోని క్లాస్ రూమ్ లు మరియు పాఠశాల ఆవరణ మొత్తం పరిశుభ్రంగా ఉన్నాయా లేవ అని చూశారు

మరియు పాఠశాల లో మొత్తం ఎంత మంది విద్యార్థులు ఉన్నారు అని మరియు విద్యార్థులకు నాణ్యమైన భోజనం మరియు త్రాగు నీటి సమస్య ఉందా అని ఉపాధ్యాయులను అడిగి

తెలుసుకున్నారు

తరువాత పాఠశాల ముందు మరియు మరియు చుట్టూ పక్కల పరిసరాలలో పరిశుభ్రంగా లేదని మరియు పాఠశాల పక్కనే పశువుల పేడ ను అక్కడనే వేయడం ఎమ్మెల్యే చూసి విద్యారులకు ఇబ్బందిగా ఉంటుంది అని తాండ పంచాయతీ కార్యదర్శి కి ఫోన్ కాల్ చేసి వీలైనంత త్వరగా పాఠశాల పరిధిలో శుభ్రంగా చేయాలని బాత్రూం లకు కావలసిన మరమ్మత్తులను చేయించాలని ఆదేశించారు

అలాగే పాఠశాలలో వంట చేసే వారికి కూడా వంటశాలను శుభ్రంగా ఉంచాలి అని మరియు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎమ్మెల్యే  వారికి చెప్పడం జరిగింది

అనంతరం ఉపాధ్యాయులకు మరియు పంచాయతీ కార్యదర్శి కి తండ లోని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు గ్రామ ప్రజలకు పిలిపించి పాఠశాల ఆవరణలో బట్టలను ఉతకడం గానీ పశువులను అక్కడ తీసుకొచ్చి నీటి ట్యాంకు వద్ద వాటిని స్నానం చేయడం గానీ వాటికి నీటిని త్రాగించడం గాని చేయకుడదని వారికి కౌన్సీలింగ్ ఇవ్వాలని వారికి అర్థమయ్యే విధంగా వారికి చెప్పాలని ఎమ్మెల్యే  చెప్పడం జరిగింది

అనంతరం ఎమ్మెల్యే  నాగల్ గిద్ద మండల ఎంఈఓ ( ఎంఈఓ )కి ఫోన్ కాల్ చేసి తండాలో పాఠశాలను ఒకసారి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే ఆ సమస్యను పూర్తి చేయాలని ఎమ్మెల్యే  వారికి చెప్పడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు పండరి రెడ్డి, సిద్ధారెడ్డి,మాజీ ఎంపీటీసీ, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now