కోమటిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా విజయలక్ష్మి

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా విజయలక్ష్మి పదవీ బాధ్యతలు చేపట్టారు.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా విజయలక్ష్మి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విజయలక్ష్మి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో నర్సాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్లో 11 సంవత్సరాలుగా విధులు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మోడల్ స్కూల్ లో పనిచేసిన ప్రిన్సిపల్ తోపాటు, ఉపాధ్యాయులను వదిలించడం జరిగిందని కోమటిపల్లి మోడల్ స్కూల్ లో ఖాళీ ఉండగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ కోమటిపల్లి మోడల్ స్కూల్లో 695 మంది విద్యార్థులు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసిస్తున్నారని ఆమె తెలిపారు.పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో అలాగే విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టిసారించినట్టు ఆమె పేర్కొన్నారు.ఈమధ్య మోడల్ స్కూల్ చుట్టుపక్కల ఉన్న చెట్లపొదలను తమ జీతములో నుండి అందరం కొంత పోగు చేసుకొని పాఠశాల సిబ్బంది సహాయంతో జెసిబి ద్వారా చెట్లపొదలను తొలగించామని మోడల్ స్కూల్ అభివృద్ధికి అన్ని రంగాల్లో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు ఇంకా సహకరించినట్లయితే పాఠశాల అభివృద్ధి మరింత మెరుగుపడుతుందని ఆమె వెల్లడించారు.

మోడల్ స్కూల్ ను సుందర వందరంగా తీర్చిదిద్దుతున్న ప్రిన్సిపల్ విజయలక్ష్మి. 

గతంలో ఉన్న ప్రిన్సిపల్, సిబ్బంది పాఠశాలను ఏ మాత్రం పట్టించుకోలేదని దీంతో పాఠశాల, కళాశాల చుట్టుపక్కల పెద్ద పెద్ద మొక్కలు పెరిగినట్లు తెలిపారు. విద్యార్థులకు ఆడుకోవడానికి సరైన గ్రౌండ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన ఆమె సిబ్బందితో మాట్లాడి వారి సొంత డబ్బుతో చుట్టుపక్కల ఉన్న ముండ్లపదలను, చెట్లను జెసిబి సహాయంతో రెండు రోజులపాటు తొలగించడం జరిగింది. అలాగే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాఠశాల అభివృద్ధి కోసం సహకారం చేస్తామన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు తెలిపి మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసే విధంగా చూస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. తాగునీటి సమస్య ఉండగా గతంలో ఎమ్మెల్యే డాక్టర్. మైనంపల్లి రోహిత్ రావుకు తెలుపగా వెంటనే ఆదివారం పాఠశాల ముందు బోరు వేయించడం జరిగింది. ఆ బోరు లో నీళ్లు రాకపోవడంతో పాత బోరును రిఫ్రెష్ చేయించడంతో అందులో కొద్దిగా నీళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. పాఠశాల కళాశాల, చుట్టూ మంచి మొరం పోయించి, విద్యార్థులు ఆడుకునేందుకు మంచి గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు ను కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తో పాటు సిబ్బంది కోరుతున్నారు. తమ స్తోమతను బట్టి చెట్లు కొమ్మలు తొలగించినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని గ్రౌండు ఏర్పాటుకు మట్టి కొట్టించాలని వారు ఆయనను కోరుతున్నారు. అలాగే పాఠశాలకు రావాలంటే నానాయాతన పడుతున్నట్లు తెలిపారు. బీటీ రోడ్డు వేయించాలని కళాశాల సిబ్బంది కోరుతున్నారు. బస్సులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. గతంలో రామాయంపేట నుండి 9 గంటలకు మోడల్ స్కూల్ కు మెదక్ ఆర్టీసీ బస్సు విద్యార్థులను తీసుకువచ్చి వదిలి వెళ్ళేదని ఆమె తెలిపారు. నేడు ఆ బస్సును ఆర్టీసీ అధికారులు రద్దు చేయడంతో విద్యార్థులు జాతీయ రహదారి గుండా వెళ్లాలంటే తీవ్ర ప్రమాదకరంగా ఉందని ఆమె అన్నారు. వెంటనే బస్సును పునరుద్ధరించాలని అనుకోరారు.

Join WhatsApp

Join Now