అన్నారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం 

హై స్కూల్
Headlines
  1. రాజ్యాంగ దినోత్సవ వేడుకలు: అన్నారం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల సందడి
  2. “రాజ్యాంగం మన హక్కుల పరిరక్షణకు శక్తి”: వాకిట శ్రీదేవి
  3. ఉపన్యాసాలు, డ్రాయింగ్ పోటీలతో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా
  4. భారత రాజ్యాంగం గొప్పతనంపై విద్యార్థులకు అవగాహన
  5. దాదాపు 76 ఏళ్లుగా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి మద్దతుగా
గుమ్మడిదల మండలంలో ని అన్నారం గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిపారు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు వాకిట శ్రీదేవి ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులతో రాజ్యాంగ విలువలో వివరిస్తూ వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ 75 ఏళ్ళుగా ప్రతి పౌరుడి హక్కులను కాపాడుతూ బాధ్యతను గుర్తుచేస్తూ న్యాయాన్ని నిలబెడుతూ ధర్మాన్ని పరీరక్షిస్తూ ఆకాశమంత ఎత్తున రెపరెపలాడుతున్న మన ఆత్మ గౌరవ పతాకం భారత రాజ్యాంగం సుదీర్ఘ పరాయి పాలనలో మగ్గిన దేశానికి బాబు రాజేంద్రప్రసాద్ మొట్టమొదట రాష్ట్రపతి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చైర్మెన్ గా ఎన్ గోపాలస్వామి అయ్యంగార్ కే యం మునిసి కృష్ణస్వామి అయ్యంగార్ సభ్యుడుగా పనిచేసే సుమారుగా రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులలో లిఖిత రాజ్యాంగాన్ని తయారు చేయడం 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదింపబడి జనవరి 26వ తేదీ 1950 సం అమలు పరుచుకున్నాం మన భారతదేశ సార్వభౌమ సామ్య బాధ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నెలకొల్పుటకు ప్రాథమిక హక్కులు బాధ్యతలు సమానత్వం భావ ప్రకటన పెంపొందించుటకు రాజ్యాంగం పనిచేస్తుంది అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి నందిని 9వ జాగృతి 8వ తబస్ 8వ గుణశేఖర్ వ్యాసాలు రాయగా ఏ సావిత్రి 8వ డి నందిని చందన 8వ ఉపన్యాసాలు తెలుపగా మహేష్ డ్రాయింగ్ వేశారు ఇందులో విజేతలు అయిన వారికి ఉపాధ్యాయులు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణికుమార్ బిహెచ్ఎల్ ప్రసన్న శశిరేఖ సంపత్ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now