జడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా కోరుట్ల జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ లో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులతో ర్యాలీని నిర్వహించి మానవహారం చేపట్టారు. రాజ్యాంగ పీఠికతో ప్రతిజ్ఞ చేసి రాజ్యాంగ దినోత్సవం గురించి ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మోహన్ ప్రసాద్, జయలక్ష్మి, జమున, లత, కృష్ణమోహన్, కృష్ణమాచారి, కృష్ణరాజన్, భాను, రామకృష్ణశాస్త్రి, నరేందర్, కిషన్, అశోక్, యూసుఫ్ అలీ, సైఫ్ఉద్దీన్ పాల్గొన్నారు.