భారత రాజ్యాంగ దినోత్సవం..ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్..

*భారత రాజ్యాంగ దినోత్సవం..*

*ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్..*

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబరు 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ద్వారానే నేడు అందరూ ఫలాలను అందుకుంటున్నారని పేర్కొన్నారు. సమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. భారతదేశంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా అందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది రాజ్యాంగం కల్పించిన గొప్పతనమేనని అన్నారు. ఈ ప్రపంచంలో పలు దేశాలు తమ రాజ్యాంగానికి తగ్గట్లు నడుస్తున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోని మన రాజ్యంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని అందరినీ సమానంగా చూడాలని.. అందరికీ అవకాశాలివ్వాలని, ఏ వ్యక్తి అయినా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించొచ్చని, ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కల్పనాధికారి శ్రీ రామ్,సీపీఓ సంజీవరావు,బీసీ సంక్షేమ అధికారి ఇందిర,వివిధ శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now