పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

పోలీస్ కిష్టయ్య

పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్

ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 27, కామారెడ్డి :

మలిదశ తెలంగాణ పోరాట తొలి అమరుడు కీర్తిశేషులు పుట్టకొక్కుల పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 15వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో గ్రామ గ్రామాన వర్ధంతి సమావేశాలను నిర్వహించి విజయవంతం చేయాల్సిందిగా ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా కమిటి అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ అనుబంధ సంఘాలు, యువత, మహిళా, ఉద్యోగులు, విద్యార్థి, మత్స్య సహకార సంఘాలు గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నట్లు జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో డిసెంబర్ ఒకటిన కూడలి వద్ద, అమరవీరుల స్తూపం వద్ద ఉదయం 11 గంటలకు అమరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజుకు ఘనంగా నివాళు అర్పించాలని కోరుతున్నాట్లు జిల్లా అధ్యక్షులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, సంఘం అధ్యక్షులు ,కార్యవర్గం , ప్రజా సంఘాల ఉద్యమ సంఘాల నాయకులు, ముదిరాజ్ బంధువులు అందరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు.

Join WhatsApp

Join Now