కోర్టు తీర్పు సారాంశాన్ని వివరించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్

*పేపర్ బ్యాలెట్ వాజ్యం కొట్టివేత*

: పేపర్ బ్యాలెట్ విధానాన్ని పున:ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టేసిన సుప్రీంకోర్టు*

 జిల్లాకు ఉత్తర్వులు అందాయి*

: కోర్టు తీర్పు సారాంశాన్ని వివరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్*

 *భారత ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని పునః ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసినట్లు జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ తెలిపారు. ఈ.వి.ఎం. ట్యాంపరింగ్ పై పిటీషనర్ డాక్టర్ కె.ఎ.పాల్ చేసిన వాదనలను న్యాయస్థానం తిరస్కరించిందని అన్నారు. పిటిషన్ ను తిరస్కరించిన సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసిందని, ఎన్నికలలో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవి.ఎం.ల విశ్వసనీయతను ప్రశ్నించే నాయకుల అస్థిరతను ఎత్తిచూపిందన్నారు. పిటిషనర్ వాదనల్లో ఎలాంటి మెరిట్ ను కనుగొనలేదని, ఎన్నికల్లో ఈవీఎంల వ్యవస్థతో రాజకీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పి.బి.వరాలే లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసిందని కలెక్టర్ పేర్కొన్నారు. కేసు కొట్టివేసి పూర్తి వివరాలను అందజేశారు. భారత్ లో ఫిజికల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించాలని కోరుతూ మత ప్రచారకుడు డా॥ కె.ఏ. పాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు పాల్పడినట్లు రుజువైతే అభ్యర్థులపై కనీసం 5 సంవత్సరాల పాటు అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయమని ఇతర అభ్యర్ధనలతో పాటు కోరడం జరిగింది. పీటీషనర్ ఇన్పర్సన్ గా హాజరైన డాక్టర్ పాల్ తొలుత జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పి.బి. వరాలే లతో కూడిన ధర్మాసనం ముందు ఇలా సమర్పించారు. ఈ పిల్ ను నేను చాలా ప్రార్థనల తరువాత దాఖలు చేశాను అన్నారు. ఆయన ముగించడానికి ముందే జస్టిక్ నాథ్ మౌఖికంగా ఇలా వ్యాఖ్యానించారు. మీరు ఇంతకు ముందు కూడా పిల్స్ దాఖలు చేశారన్నారు. ఇంత అద్భుతమైన ఆలోచనలు మీకెలా వచ్చాయి? అని ప్రశ్నించారు. దీనిపై పిటిషనర్ స్పందిస్తూ, “తాను ఇప్పుడే లాస్ ఏంజిల్స్ లో జరిగిన గ్లోబల్ పీస్ సమ్మిట్ నుంచి వస్తున్నానని, శనివారం జరిగిన శిఖరాగ్ర సదస్సు ఘన విజయం తరువాత ఇప్పుడే వచ్చానని చెప్పారు. ఈ పిల్ లో నాకు మద్దతుగా 180 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తులు ఉన్నారు. నేను గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ని మరియు నేను 3,10,000 మంది అనాథలను మరియు 40 లక్షల మంది వితంతువులను సంరక్షించానన్నారు. ఢిల్లీలో 5 వేల మంది వితంతువులున్నారన్నారు. రాజకీయ రంగంలో ఎందుకు జోక్యం చేసుకోవాలనుకుంటున్నారని జస్టిస్ నాథ్ ప్రశ్నించగా, దీనిపై ఆయన స్పందిస్తూ, ఇది రాజకీయం కాదు. చూడండి, నేను 155 దేశాలకు మరియు ప్రపంచంలోని ప్రతి దేశానికి వెళ్లాను, మీరు బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ను చూస్తే ప్రపంచంలోని ప్రతి ప్రజాస్వా మ్యాన్ని చూస్తే ఫిజికల్ బ్యాలెట్ పేపర్ ఉంటుందని, ప్రతి దేశం, 180 దేశాలు నియంతలు తప్ప, వారికి ఎన్నికలు లేవు కాబట్టి, పుతిన్ తో కలిసి రష్యాకు, అసద్తో సిరియాకు, చార్లెస్ టేలర్తో లైబీరియాకు వెళ్లి ఆయన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చాను. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఆయన సతీమణి కూడా శనివారం సదస్సుకు హాజరయ్యారు. మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాము” అన్నారు. ఇది ఆర్టికల్ 14, 19, 21ల ఉల్లంఘనేనని డాక్టర్ పాల్ వాదించారు. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం, యువర్ ఆనర్ ఈ కేసును విచారించడానికి చాలా ముఖ్యమైన రోజు అని వ్యాఖ్యానించారు. తనను ఆర్టికల్ 32 కోర్టును ఆశ్రయించడానికి మరియు వాస్తవాలను సమర్పించడానికి అనుమతిస్తుందని డాక్టర్ పాల్ తన వాదనలను కొనసాగించారు. “వాస్తవాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ తెలుసు కానీ ప్రత్యోపాయం ఎందుకు లేదు? 43 ఏళ్లుగా ప్రపంచ ప్రధానులకు, దేశాధినేతలకు మానవతావాద, రాజకీయ సలహాదారుగా ఉన్నాను. ప్రస్తుత ప్రధానితో సహా గత ఆరుగురు ముఖ్యమంత్రులు, ప్రధానులు కూడా నా సదస్సుకు హాజరయ్యారు. ఆగస్టు 8న 18 రాజకీయ పార్టీలు, న్యూఢిల్లీలోని లె మెరిడియన్లో ఈ ప్రార్థనకు మద్దతు తెలిపాయి అంటే మీరు కూడా అశ్చర్యపోతారు ప్రార్ధన అంటే ఏమిటి? మిగతా ప్రపంచాన్ని అనుసరిద్దాం. మొత్తం 197 దేశాల్లో 180 దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని అని మనం అనుసరించాలన్నదే. ప్రపంచం కంటే భారత్ బిన్నంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా అని జస్టిస్ నాథ్ మౌఖికంగా ప్రశ్నించగా, అవినీతి ఉంది కాబట్టి అని సమాధానమిచ్చారు. ఈ వాదనను తోసిపుచ్చిన జస్టిస్ నాథ్ ఎలాంటి అవినీతి లేదు. అవినీతి అని ఎవరు చెప్పారు?”, తన వద్ద అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని డాక్టర్ పాల్ పేర్కొన్నారు. తొమ్మిది వేల కోట్లు, వంద కోట్ల డాలర్లకు పైగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ఏడాది జూన్లో ప్రకటించిందని, దాని పర్యవసానం ఏమిటని, ఇప్పటికే గత ముగ్గురు ఎన్నికల కమిషనర్లను కలిసి ఆధారాలు అందజేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలని ఆయన అన్నారు. దీనిపై జస్టిస్ నాథ్ స్పందిస్తూ ఎన్నికల సమయంలో మాకు ఎప్పుడూ డబ్బులు అందలేదు. మాకు ఏమీ అందలేదు. డాక్టర్ పాల్ కొనసాగిస్తూ, ఇటీవలి ఎన్నికల్లో నేను మాఫియాను చూశాను. నేను పోలీస్ గా ఉన్నాను, పోలీసులు, ఇతరులు నన్ను గౌరవిస్తున్నందున నన్ను వదిలేశారు. నమ్మశక్యం కాని ఆవినీతి కారణంగా ఎమ్మెల్యేలు లోపలికి వెళ్లి అక్షరాలా ఈవీఎంలను పగులగొట్టారని స్వామి సహా కొందరు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాబట్టి, ఇది ఊహకు అందనిది. మా సదస్సుకు హాజరైన నిపుణుడు ఎలాన్ మస్క్ తీసుకోండి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఆయన లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. 2018లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని ట్వీట్ చేశారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, నేను ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారనే తన ట్వీట్లను జత చేశానని చెప్పారు. జస్టిస్ నాథ్ పిల్ ను కొట్టివేస్తూ ఇలా అన్నారు. “ఇక్కడ ఏం జరుగుతోంది. ఎన్నికల్లో ఒకవేళ మీరు గెలిస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదని ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసారు అని, చంద్రబాబు నాయుడు ఓడిపోయినప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని చెప్పారు. ఇప్పుడు ఈసారి జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయారని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఆయన అంటున్నారని అన్నారు.*

Join WhatsApp

Join Now