భద్రాచలం లోగల సాంఘిక సంక్షేమ బాలికలు(A) మరియు కళాశాల వసతిగృహం ప్రహరీ గోడ కూలి నెలలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు…
భద్రాచలంలో ప్రధాన రహదారి పక్కన కూనవరం రోడ్డులో గల బాలికల వసతిగృహం ప్రహరీ గోడకు గ్రీన్ మ్యాట్ క్లాత్ కట్టి రోజులు గడిపిస్తున్న అధికారులు…
దళిత బాలికలు,కళాశాల విద్యార్థినీలు కలిసి ఉండే హాస్టల్ కు గోడ కూలి నెలలు గడుస్తున్న స్పందించని సంబంధిత అధికారులు…
ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ బాలికల హాస్టల్ ప్రహరీ గోడ కూలి సుమారుగా చాలా నెలలు గడుస్తున్న ఇంకా గోడ నిర్మాణం చేపట్టకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సంఘం నాయకులు.
ఇది సంబంధిత హాస్టల్ వార్డెన్ పట్టించుకోకపోవడమా? లేక సంబంధిత జిల్లా అధికారుల నిర్లక్ష్యమా?
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి భద్రాచలంలో గల సాంఘిక సంక్షేమ బాలికలు మరియు కళాశాల విద్యార్థినీలు గల వసతిగృహానికి ప్రహరీ గోడ నిర్మాణానికి అధికారుల ఆదేశించి సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్న దళిత సంఘాలు, మరియు స్థానిక ప్రజలు.