ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి.
మెదక్, రామాయంపేట మండలాలతో పాటు జిల్లాలో పూలే విగ్రహానికి ఘన నివాళి అర్పించారు.
దేశ ప్రజల కోసం చేసిన సేవలను పలువురు కొనియాడారు.
మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతీ భా ఫూలే గారి134వ వర్ధంతి సందర్బంగా పూలే విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించిన నాయకులు వారు దేశ ప్రజల కోసం చేసిన సేవలను పలువురు కొనియాడారు.భారత దేశంలో సంఘ సంస్కరణలకు అద్యుడు, బడుగు, బలహీన వర్గాల,శూద్రులకు విద్యద్వారనే బ్రతుకులు మారుతాయని,స్త్రీ విద్యాద్వారనే దేశం,సమాజం బాగుపడుతుందని నమ్మి ఆచరించిన,ఆదర్శ ప్రాయుడు,తన భార్య సావిత్రి భాయి ఫూలే కి విద్యనేర్పించి , భారత దేశంలో మొట్టమొదటి మహిళా అధ్యాపకురాలిని తయారు చేసి,విద్యాలయాలను స్థాపించి శూద్రులకు,బడుగు బలహీనర్గాలకు విద్యనేర్పిన మహాత్ముడు.బాల్య వివాహాలు, వితంతువివాహాలు,సతీసహగమనం వంటి అనేక సంఘ సంస్కరణలకు ఆద్యుడు,గాంధీ, అంబేద్కర్ ల గురువు మహాత్మ జ్యోతీభా ఫూలే ఆశయాల ను కొనసాగిస్తాంవారికి మా ఘన నివాళులు. ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి చింతల నర్సింలు ,మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆఫీజ్ మొల్సబ్,నాయి బ్రాహ్మణ అధ్యక్షుడు రమేష్,వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్,మాజీ కౌన్సిలర్లు రవి,మోహన్ గౌడ్,రమేష్,పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు భూపతి, కృష్ణ, కవిత, సిద్దు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.