ఆరోగ్య కేంద్రంలో ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

*ఆరోగ్య కేంద్రంలో ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం*

*జమ్మికుంట నవంబర్ 28 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాచినపల్లి గ్రామంలో డాక్టర్ ఫర్హానుద్దీన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 124 మంది గ్రామస్తులకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 6 గురు జ్వర పీడితులకు ఆర్ డి టి కిట్స్ ద్వారా మలేరియా, డెంగీ పరీక్షలు నిర్వహించారు.5 గురు జ్వర పీడితులకు రక్త నమూనాలను సేకరించి, వ్యాధి నిర్దారణ పరీక్షల కోసం ల్యాబ్ కి పంపించారు. అదేవిధంగా పాపక్కపల్లి గ్రామoలో డాక్టర్ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించి 69 మంది గ్రామస్తులకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు .3జ్వర పీడితులను గుర్తించి వారి నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించారు. ఈ రెండు గ్రామాలలో వైద్య శిబిరాలకు వచ్చిన ప్రజలకు అసంక్రామిత వ్యాధులు రక్త పోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్బంగా వైద్యులు గ్రామస్తులకి సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగీ, చికెన్ గున్య వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధి లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత డ్రైడే లపై అవగాహన కల్పించారు. మహిళలకు ఆరోగ్య మహిళా ప్రోగ్రాం పై అవగాహన కల్పించారు. దోమల నివారణ అవి కుట్ట కుండా తీసుకోవలసిన జాగ్రత్తలను గ్రామస్తులకి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాజేష్ కుమార్, ఫర్హానుద్దీన్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్స్ సదానందం, కుసుమకుమారి, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఏఎన్ఎంలు సావిత్రి, రమ పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, నరేందర్ రెడ్డి, ఆశా కార్యకర్తలు రమాదేవి, కవిత, లక్ష్మి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now