జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి ఆకస్మిక తనిఖీ

*జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి ఆకస్మిక తనిఖీ*

జగిత్యాల

ధర్మపురి లోని ఏరియా హాస్పిటల్ ను శుక్రవారం మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెలవారీగా డెలివరీస్ జరిగిన రిజిస్టర్ ను పరిశీలించారు డెలివరీలు తక్కువగా నమోదు కావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల తప్పకుండా కనీసం 50 డెలివరీలను జరిగేలాగా చూడాలని ధర్మపురి ఏరియా హాస్పిటల్ ఆర్ ఎం ఓ డాక్టర్ రామకృష్ణ కి సూచించారు. పరిసర గ్రామాలలోని ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ హాస్పిటల్ లోనే ప్రసవం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ఆర్ఎంవో డాక్టర్ రామకృష్ణ , వైద్య సిబ్బంది మరియు హెల్త్ సూపర్వైజర్ ఇండి వర శ్యామ్ పాల్గొన్నారు

Join WhatsApp

Join Now