కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో.

కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాలను శుక్రవారం మండల ఎంపీడీవో వెంకటయ్య ఆకస్మిక తనిఖీ చేశారు.తనిఖీల్లో భాగంగా పాఠశాల పరిసరాలు పరిశుభ్రత టాయిలెట్ నిర్వహణ, భోజనశాల, స్టాక్ రూమ్, కూరగాయల తనిఖీ డైనింగ్ హాల్ పరిసరాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో వంట వండిన విధానాన్ని మరియు విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని నాణ్యతను పరిశీలించి నాణ్యత విషయములో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని ఇన్చార్జి ప్రిన్సిపల్ ఉమా మరియు వంట మనుషులకు సూచించారు. కూరగాయల సరఫరా చేసే కాంట్రాక్టర్ సక్రమమైనటువంటి వస్తువులు సరఫరా చేయని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవలసిందిగా ప్రిన్సిపల్ కు హెచ్చరించారు. పరిశీలనలో టాయిలెట్లు పరిసరాలు కొంత అపరిశుభ్రంగా ఉన్నందున స్థానిక గ్రామపంచాయతీ సిబ్బందితో ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు పిఆర్ఏఈ రుక్మాంగద మరియు ఏపీవో రఘు మరియు పాఠశాల సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now