సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వయోపరిమితి అరవై ఒక్క ఏళ్లకు పెంచాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ నవంబరు 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి శ్యామ్ సుందర్ కి వినతి పత్రం అందజేశారు.సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వయోపరిమితి అరవై ఒక్క ఏళ్లకు పెంచాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి శ్యామ్ సుందర్ కి వినత పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు ఏరియా అధ్యక్షులు అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పర్మినెంట్ కార్మికులకు వయోపరిమితి అరవై ఒక్క ఏళ్లకు పెంచినట్లుగా పెంచకపోవడంతో ఒక సంవత్సరం సేవలను కోల్పోతున్నారన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ఆర్థిక పరిస్థితి సింగరేణి యాజమాన్యానికి తెలియంది కాదని. ఇప్పటివరకు కుటుంబ యాజమానిగా తాము పని చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితని. అదేవిధంగా మహిళ కాంట్రాక్ట్ కార్మికుల్లో కూడా ఎక్కువమంది ఒంటరి మహిళలు తమ సంపాదన మీదనే బ్రతుకు బండి ముందుకు సాగాల్సిన పరిస్థితని. వయసు పైబడిన కూడా వారి జీవన ప్రమాణాల్లో కాంట్రాక్ట్ కార్మికుల బ్రతుకుల్లో పెద్దగా మార్పు లేదని.పిఎఫ్ కటింగ్ నిబంధనలు అడ్డంకుల నేపథ్యం వయో పరిమితి పేరుపై తాము తమ జీవనోపాధికి కారణమైన పని కోల్పోతే యాజమాన్యం పని నుండి తొలగిస్తే ఎలా బ్రతకాలి అనే ప్రశ్న అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులను వేధిస్తోందన్నారు. ఆరోగ్యంగా పనిచేసుకోగలిగే పరిస్థితుల్లో ఉన్న తమను విధుల నుండి తొలగించవద్దని మానవతా దృక్పథంతో పర్మినెంట్ కార్మికులకు ఏరకంగా అయితే అరవై ఒక్క సంవత్సరం వయోపరిమితి సడలించి సాంకేతిక సమస్యను తొలగించి ఒక సంవత్సరం అదనంగా పనిచేసుకునే అవకాశం కల్పించారో వారికి కూడా అలాంటి అవకాశ కల్పించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కే గురుమూర్తి, యు శివరామకృష్ణ, ఎం సాంబయ్య, ఎం గ్రూపు సాధు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now