9ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూసాం..?

9ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూసాం.. ఇక ఓపిక లేదు అంటూ కోర్టు ఆవరణలోనే విలపించిన రిషితేశ్వరి తల్లి

వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకుంది. 

ర్యాగింగ్, వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. 

తాజాగా కేసును కొట్టేయడంతో వారు కోర్టు ఆవరణలో బోరున విలపించారు.. రిషితేశ్వరిని ఫ్రెషర్స్ పార్టీలో సీనియర్లు లైంగికంగా వేధించారని, ఆ విషయం ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె పేరెంట్స్ చెప్పుకొచ్చారు. 

పేర్లు డైరీలో ఉన్నాయని, ఆ డైరీని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో తెలియడం లేదన్నారు. 

9ఏళ్లుగా న్యాయం కోసం చూశామని, ఇక ఓపిక లేదని ఆమె తల్లి కోర్టు ఆవరణలోనే విలపించారు.

Join WhatsApp

Join Now