రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం

*రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం*

–మార్కెట్ కమిటీ ఛైర్మన్ పులి కృష్ణ

రైతు పండుగ కార్యక్రమంను పురస్కరించుకొని బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ఆధ్వర్యంలో శనివారం మార్కెట్ కమిటీ పాలకవర్గంతో కలిసి, ఆయన మండలంలోని పలు గ్రామాలలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్బంగా పులి కృష్ణ మాట్లాడుతూ, రైతులందరు ప్రజా ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ను ఇచ్చిందని, రైతు సంక్షేమ పథకాలను అమలు చేసిందని సంతోషాన్ని వ్యక్తం చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి పాటు పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిలువేరి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు పులి సంతోష్, బోనాల మల్లేశం, పుల్ల పోచయ్య, మచ్చ కుమార్, నల్ల చంద్రారెడ్డి, మాతంగి అనిల్, న్యాలపట్ల కనుకయ్య, చాడ సతీష్ రెడ్డి, నాయకులు ఎర్రల రాజు, బండిపెల్లి శ్రీనివాస్ గౌడ్, ముత్యం సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now