Headlines
-
డిసెంబర్ 7నుంచి సీఎం కప్ క్రీడలు: తెలంగాణ యువత కోసం పెద్ద అవకాశాలు
-
సంగారెడ్డిలో సీఎం కప్ క్రీడా ఏర్పాట్లు పూర్తి
-
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి సీఎం కప్ పోటీలు
-
సమిషన్ కలెక్టర్ వల్లూరు క్రాంతి: క్రీడలు ప్రజల ఐక్యతకు ప్రతిబింబం
*జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి*
సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): డిసెంబర్ 7వ తేదీ నుండి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో సీఎం కప్ క్రీడా పోటీలపై మండల ప్రత్యేకాధికారులు, వివిధ స్పోర్ట్స్ కమిటీలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డిసెంబర్ 7, 8 తేదీలలో గ్రామస్థాయిలో సీఎం కప్ పోటీలు, డిసెంబర్ 10 నుండి 12 వరకు మండల స్థాయిలో, 16వ తేదీ నుండి 21 వరకు జిల్లాస్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నిష్పక్షిక వాతావరణంలో జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, వివిధ శాఖల అధికారులు కలెక్టర్ ఆదేశించారు.