జిల్లాలో కెనరా బ్యాంక్18వ శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

బ్యాంక్
Headlines in Telugu:
  1. “కెనరా బ్యాంకు 18వ శాఖ ప్రారంభించిన జిల్లా కలెక్టర్”
  2. “సంగారెడ్డిలో కెనరా బ్యాంక్ శాఖ ప్రారంభం”
  3. “బ్యాంకు ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ ద్వారా కీలక సూచనలు”
  4. “సి.ఎస్.ఆర్. ఫండ్ ద్వారా పోతిరెడ్డిపల్లి జెడ్.పి.హెచ్ స్కూల్ కు సౌండ్ సిస్టమ్ అందించడం”

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి బై పాస్ వద్ద కెనరా బ్యాంకు తన 18వ శాఖను బ్యాంకు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకులు రైతులకు, ఎం ఎస్ ఎం ఈ, ఉపాధి, అన్ని ప్రాధాన్యత రంగాలకు ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా ఖాతాదారులకు విరివిగా రుణాలు అందించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ సందర్భముగా కెనరా బ్యాంకు వారు సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా పోతిరెడ్డి పల్లి జెడ్ పి హెచ్ స్కూల్ వారికీ 44,707 రూపాయలు వెచ్చించి సౌండ్ సిస్టంను అందించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ బి.శ్రీనివాస్, జిల్లాలీడ్ బ్యాంక్ మేనేజర్ గోపాల్ రెడ్డి, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now