Headlines:
-
ఏపీ ప్రభుత్వ చట్ట సవరణ: 2 కంటే ఎక్కువ పిల్లలున్నవారికి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం
-
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ పిల్లలున్న అభ్యర్థులకు చట్ట సవరణ: హైకోర్టు విచారణ
-
చంద్రబాబు ఎలాంటి చట్ట సవరణ కోరారు? తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే మార్గదర్శకాలు
-
ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్న అభ్యర్థులకు తెలంగాణలో ఏ పరిస్థితి?
-
పిల్లల సంఖ్య పెరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అనర్హతపై చట్ట సవరణ
హైదరాబాద్:నవంబర్ 30
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి చట్టసవరణ? ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. నవంబర్ 19న ఏపీ అసెం బ్లీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది. చట్ట సవరణ ఎందుకు చేశారంటే? 1989-90 మధ్య కాలంలో దేశంలో జనాభా పెరుగు దలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది పిల్లలున్న వ్యక్తులు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు గా 1994 మే 30న బిల్లుకు ఆమోదం తెలిపింది.
అయితే రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ మంది పిల్లలను కనాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారంగా సంతానోత్పత్తి రేటు తగ్గింది. 1993-94 లో 3.7 శాతంగా ఉంది.
అయితే ఈ రేటు ఇప్పుడు 2.1కి పడిపోయింది. ఏపీ రాష్ట్రంలో ఇది 1.6కి తగ్గింది. 15 ఏళ్ల వయస్సున్న వారి సంఖ్య భారీగా తగ్గింది. 2015-16 నాటికి దేశ జనాభాలో 15 ఏళ్ల వయస్సున్నవారు 28.6 శాతం ఉంటే ఇప్పుడు 2 శాతానికి తగ్గింది.
ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది పిల్లలను కనాలని చంద్రబా బు, కోరారు. తెలంగాణలో కూడా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 213 చెబుతోంది.
అయితే తెలంగాణ మున్సి పాలిటీ చట్టం ప్రకారంగా కౌన్సిలర్, మేయర్, కార్పో రేటర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధులకు ఎంతమంది పిల్లలున్నా పోటీ చేసేందుకు ఇబ్బం దులు లేవు. అయితే గ్రామీణ ప్రాంతంలో ఒక రకంగా, మున్సిపాలిటీల్లో మరో రకంగా చట్టాలు న్నాయి.
దీనిపై న్యాయవాది రాపోలు భాస్కర్ 2023 డిసెంబర్ లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీ తరహాలోనే చట్ట సవరణ చేసే అవకాశం ఉంది. చూడాలి మరి!