లేఅవుట్ యజమానులు ఇష్టానుసారం ఏర్పాటు చేస్తే సహించేది లేదు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లే అవుట్ లకు అనుమతులు ఉండవు
–కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 06, కామారెడ్డి టౌన్ :
కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న లే అవుట్ లలో ఉన్న సౌకర్యాలు, రోడ్డు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల ను పట్టణ పట్టణ ప్రణాళిక అధికారితో కలిసి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణ పరిధిలో బృందావనం గార్డెన్స్ నుండి లింగాపూర్, దేవుని పల్లి తరక, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనక నుండి కామారెడ్డి సబ్ స్టేషన్ వరకు ఉన్న అన్ని లె అవుట్ లను పరిశీలించడం జరిగిందనీ అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే లేఅవుట్ యజమానులు ఇష్టా రాజ్యంగ ఏర్పాటు చేస్తే సహించేది లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లె అవుట్ లకు అనుమతులు ఉండవనీ అన్నారు. దేవునిపల్లి పరిధిలో హై టెన్షన్ వైర్ల కింద 83 ఫిట్ల రోడ్డు తప్పని సరిగా ఉండాలనీ హై టెన్షన్ వైర్ల కింద రెండు వైపులా 33 ఫీట్ల రోడ్డు తప్పని సరన్నారు. లె అవుట్ లలో ఎక్కడ ఎలాంటి అవతవకలు ఉన్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.