ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి

ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 06, కామారెడ్డి :

ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, రిటైర్డు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ఉద్దెర మాటలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఢోకా ఇచ్చారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలనీ డిమండ్ చేశారు. పోలీసులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్స్, టిఎ, డిఎ లు వెంటనే చెల్లించాలనీ అన్నారు. చివరికి ఏళ్ళ తరబడి ప్రజా సేవ చేసి పదవి విరమణ పొందిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగస్తులకు కూడా ప్రభుత్వం బకాయి పడిందనీ అన్నారు. ఏడాది కాలంగా రైతులను, విద్యార్థులను, జర్నలిస్టులను, మహిళలనే కాదు చివరికి ఉద్యోగస్తులను కూడా రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తు వస్తుందని అన్నారు. ఈ అసెంబ్లీ అయ్యే లోపు బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు భరత్, కౌన్సిలర్ లు నరేందర్, శ్రీనివాస్, నాయకులు వేణు, సంద్య, యాదమ్మ, హరిక, రవీందర్, భూపాల్ రెడ్డి, శ్రీధర్, అనిల్, సురేష్, బుమేష్, ప్రవీణ్, శ్రీకాంత్, ప్రతాప్, శ్రీనివాస్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now