రేవంత్ రెడ్డి అబద్ధాల పుట్ట : ఈటేల రాజేందర్

రేవంత్ రెడ్డి
Headlines
  1. రేవంత్ అబద్ధాలపై ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు
  2. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలు – బీజేపీ సభలో దుమ్మెత్తిపోశిన ఈటల
  3. మూసి పక్కన ప్రజల బాధలు: రేవంత్ డ్రామాలు తప్ప పరిష్కారం లేదు
  4. సర్పంచుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆవేదనపై ఈటల సంచలన వ్యాఖ్యలు
  5. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రేవంత్ బలైపోతున్నారని విమర్శలు
రేవంత్ అబద్ధాల పుట్ట. హామీలు ఏమోగానీ చల్లగా బ్రతికితే చాలని ప్రజలనుకొంటున్నారు: మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్

– వేలకోట్లు అధిష్ఠానానికి పంపి రేవంత్ పదవి కాపాడుకుంటున్నారని.  రోజుకో నాటకం ఆడుతు.  ఇప్పుడు ఫోర్త్ సిటీ నాటకం మొదలుపెట్టీ ఇచ్చిన హామీలు  అమలు చేసే దమ్ము  రేవంత్ రెడ్డికి లేదన్నారు.

కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది ప్రభుత్వంలోకి వచ్చేది లేదు ఇచ్చేది లేదు అని గుట్టకు తాడు కడదాం అన్నట్టు హామీలిచ్చారని అన్నారు

రేవంత్ అబద్దాలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని ఆయన ఇచ్చిన హామీలు ఏమోగానీ చల్లగా బ్రతకనివ్వండి చాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు

బిల్లులు రాక 50 మందిదాకా సర్పంచ్ లు చనిపోయారని 

యాభైమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టు 12 వేలు దేవుడెరుగు మావాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆటో డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారని

ప్రభుత్వం వస్తే ఇళ్లు కట్టిస్తారు కానీ రేవంత్ వచ్చి ఇళ్లు కూలగొడుతున్నారు. హైడ్రా పేరిట డ్రామా చేశారు. ఎప్పడు బుల్డోజర్లు వస్తాయా అని కంటిమీద కునుకులేకుండా మూసి పక్కన ఉన్నవారు బ్రతుకుతున్నారు. అలాంటి వారికి బీజేపీ అండగా నిలిచింది. ధైర్యం ఇచ్చి కాపాడుకుందన్నారు

ఇళ్లు కూలగొడితే బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుర్తు చేశారు మూసి పక్కన ఉన్నవారు హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి రేవంత్ తీసుకు వచ్చారన్నారు

రేవంత్ ప్రేమ మూసి పక్కన ఉన్న ప్రజల మీద కాదని పక్కన ఉన్న భూములు లాక్కొని అదానీ, పెద్ద కంపెనీలకు.. అప్పజెప్పి డబ్బులు తీసుకొని ఢిల్లీకి పంపిస్తున్నారాన్నారు 

వేలకోట్లు అధిష్ఠానానికి పంపి పదవి కాపాడుకుంటున్నాడని 

అందుకే రేవంత్ రోజుకో నాటకం ఆడుతున్నాడన్నారు 

హైడ్రా, మూసి, లగిచర్ల అయిపోయింది ఇప్పుడు ఫోర్త్ సిటీ పేరుతో పేదల, దళితుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని రేవంత్ కి హామీలు అమలు చేసే దమ్ము లేదన్నారు 

ఓటమితో కెసిఆర్ కు దిమ్మతిరిగి ఫాం హౌస్ కు పరిమితమయ్యారని కెసిఆర్ కు 10 ఏళ్ళు పడితే, రేవంత్ కు 10 నెలల్లోనే అభాసుపాలయ్యాడన్నారు 

చిప్ప చేతికిచ్చాడు.

మాటలు చెప్పి, మీడియాను మేనేజ్ చేసి, అబద్ధాలు చెప్పి బుకాయించే ప్రయత్నం చేస్తున్నాడు. 

బీజేపీ ప్రజల వెంట ఉంటుందని ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలను అమలు చేయిస్తుందని ఈ వేదికమీద నుండి హామీ ఇస్తున్నామన్నారు

Join WhatsApp

Join Now