Headlines :
-
“రామిడి సంజీవ్ మానసిక పాఠశాలకు ఆర్థిక సహాయం అందజేసి సోదర ప్రేమను ప్రదర్శించారు”
-
“జమ్మికుంటలో రామిడి సంజీవ్ 17వ పుట్టినరోజున 20 వేల రూపాయల సహాయం”
-
“దివ్యాంగ విద్యార్థులకు రామిడి సంజీవ్ భవిష్యత్తులో సహకారం ఇవ్వాలని తెలిపారు”
-
“రామిడి సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకు ఆర్థిక సహాయం”
-
“సంఘ సేవలో రామిడి సంజీవ్, దివ్యాంగ విద్యార్థుల కోసం అంకితభావం”
*జమ్మికుంట డిసెంబర్ 7 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం లోని మడిపల్లి గ్రామానికి చెందిన రామిడి సంజీవరెడ్డి సంధ్య ఏకైక కుమారుడు రామిడి రమణారెడ్డి 17 సంవత్సరాల పుట్టినరోజు పురస్కరించుకొని 20 వేల రూపాయలను ఆశ్రమ పాఠశాల వ్యవస్థాపకులు సూత్రపు బుచ్చిరాములకు శనివారము అందజేశారు. స్థానిక సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో కేకు కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు .వేడుకలను ఘనంగా జరుపుకున్నారు పిల్లలందరికీ భోజనం ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఆశ్రమాన్ని సందర్శించి ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించారు ఇంకా ముందు ముందు కూడా దివ్యాంగ పిల్లలందరికీ తప్పనిసరిగా సహకారం అందిస్తానని రామిడి సంజీవ్ తెలిపారు రామిడి సంజీవ్ , వారి కుటుంబ సభ్యులందరికీ పేరెంట్స్ కమిటీ తరఫున పాఠశాల ప్రిన్సిపల్ సూత్రపు బుచ్చి రాములు కృతజ్ఞతలు తెలిపారు.