మాజీ ఎంపీపీ రామస్వామి పాడే మోసిన పాడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

*మృతి చెందిన మాజీ ఎంపీపీ రామస్వామి పాడే మోసిన పాడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి*

జమ్మికుంట డిసెంబర్ 3 ప్రశ్న ఆయుధం

ఉమ్మడి జమ్మికుంట మండల మాజీ ఎంపీపీ,విద్యోదయ విద్యాసంస్థల అధినేత ఏబూషి రామస్వామి అనారోగ్యంతో మృతి చెందగా ఆయన అంతిమయాత్రలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని పాడేమోశారు.ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.రామస్వామి ప్రజాసేవలలో అంచలంచలుగా ఎదిగి ప్రజలకు సేవ చేసిన గొప్ప వ్యక్తి అని, ఆయన మృతి సమాజానికి తీరని లోటు అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు, బిఆర్ఎస్ నాయకులు పోల్నేని సత్యనారాయణరావు, జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొనగంటి సంపత్,బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీపీ ఏబూసి రామస్వామి కుటుంబాన్ని పరామర్శించిన ప్రణవ్*

ఉమ్మడి జమ్మికుంట మండల మాజీ ఎంపీపీ,విద్యోదయ విద్యాసంస్థల అధినేత ఏభూషి రామస్వామి సోమవారం అనారోగ్యoతో మృతి చెందగా మృతుని కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాల్లో,విద్యా సంస్థల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.ఈ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ముందుండేవారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పొనగంటి మల్లయ్య, దేశిని కోటి, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, సుంకరి రమేష్, పూదరి శివకుమార్ గౌడ్,పొనగంటి రాము కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment