Headlines
-
జుక్కల్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన
-
పేద విద్యార్థులకు పెద్ద అవకాశం: జుక్కల్లో యువ భారత స్కూల్ ప్రారంభం
-
జూపల్లి కృష్ణారావు విద్యారంగంపై కీలక వ్యాఖ్యలు: మంత్రి మాట్లాడుతూ
-
జుక్కల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం – మంత్రి అభినందన
-
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ: యువ భారత స్కూల్స్, స్కిల్స్ యూనివర్సిటీలు
ప్రశ్న ఆయుధం న్యూస్
జుక్కల్ నియోజకవర్గం
డిసెంబర్-07
మద్నూర్ మండలంలోని ఎల్లమ్మ బండల దగ్గర యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి రాష్ట్ర ఎక్సైజ్ &పర్యాటక శాఖ మరియు నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తో కలిసి శంకుస్థాపన చేశారు..
అనంతరం మంత్రి మీడియతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని తెలిపారు..
రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు..
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నెలకొల్పుతున్నట్లు తెలిపారు..
పేద విద్యార్థులకు ఇది వరం లాంటిదని, పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలనే మంచి ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు..
అదేవిధంగా హైదరాబాద్ నగరంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మరియు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేశారు..
విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు..
కామారెడ్డి జిల్లాలో మొదటగా జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తాపత్రయం, కృషిని మంత్రి అభినందించారు..
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ప్రభుత్వ అధికారులు, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు..