గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుల్ ల మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

గజ్వేల్ ప్రతినిధి, డిసెంబర్ 08, ప్రశ్న ఆయుధం :

ఈసీఐఎల్ లో జరిగే మారథాన్ వెళ్తూ
బైక్ పై వెళ్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు ఆదివారం తెల్లవారుజామున గజ్వేల్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న 2004 బ్యాచ్కు చెందిన పరంధాములు గౌడ్ (43), దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న 2007 బ్యాచ్కు చెందిన పూస వెంకటేష్ (42) ఏపీ 16 బిఎన్ 9215 నంబరు గల బైక్ పై జాలిగామ వైపు నుండి గజ్వేల్ వైపు ఆదివారం తెల్లవారుజామున సుమారు 5:20 గంటలకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. వీరు సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరు, గాడి చల్లపల్లి గ్రామస్తులుగా గుర్తించారు. విధులు నిర్వర్తించి హైదరాబాదులో గల మారధాన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతూ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న గజ్వేల్ పట్టణ ఇన్స్పెక్టర్ సైదా సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now