తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి..!

తల్లి
Headlines :
  1. తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి – బీఆర్ఎస్ తీవ్ర విమర్శ
  2. విగ్రహ వివాదం: రేవంత్ రెడ్డి పై బండారి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
  3. తెలంగాణ చిహ్నాలను కనుమరుగు చేసే కుట్ర: బీఆర్ఎస్ ఆరోపణలు
  4. కాంగ్రెస్ తల్లి ప్రతిమ గాంధీ భవన్‌లో పెట్టుకోవాలని డిమాండ్
  5. తెలంగాణ చరిత్ర రక్షణ కోసం బీఆర్ఎస్ ఘాటుగా స్పందన

– సచివాలయంలో కాదు, గాంధీ భవన్ లో పెట్టుకో రేవంత్ రెడ్డి

– బిఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్ర ఆస్తిత్వ చిహ్నాలను ఒక్కొక్కటిగా కనుమరుగు చేసే కుట్రకు తెరలేపారని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఇలా ఒక్కొక్క చరిత్ర ఆనవాళ్ళను తుడిపేస్తున్నారని, తాజాగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తన ఫ్యూడాలిస్ట్ భావజాలన్నీ చాటుకున్నారని అన్నారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత మాత, విగ్రహాన్ని దేవత స్వరూపంగా మార్చి ఈ దేశానికి రుద్దిన కాంగ్రెస్, ఎందుకు స్వాతంత్ర సమరయోధులైన మహిళ పోరాట యోధుల రూపంతో భారత మాతను రూపొందించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ తల్లి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఝాన్సీ లక్ష్మి బాయ్, దుర్గా బాయ్ దేశ్ ముఖ్, సరోజినీ నాయుడు లాంటి వాళ్ళ రూపాలను భారత మాత విగ్రహం లో ఎందుకు పొందుపర్చలేదో చెప్పాలని అన్నారు.తెలంగాణ ఆస్థిత్వానికి ప్రతీక గా ఉన్న తెలంగాణ తల్లి ఒక వ్యక్తికో ఒక వర్గానికో ప్రతీక కాదని, ఈ ప్రాంత సాంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని,సబ్బండ వర్గాల తెలంగాణ పండుగ బతుకమ్మ ను తెలంగాణ తల్లి నుండి దూరం చేసి, ఆభరణాలు, కిరీటం లేకుండా ఉన్న విగ్రహం పెట్టి తెలంగాణ మహిళ లు అంటే పేదవాళ్ళు అనేలా చూపెట్టేలా ఈ విగ్రహాన్ని రూపొందించారని, టీఎస్ వుంటే టీజీ గా కేసీఆర్ బొమ్మ పాఠ్యపుస్తకాలపై ఉన్నదని కొన్ని వేల పుస్తకాలను విద్యార్థులకు అందకుండా చేస్తూ, చరిత్రను వక్రీకరించి తెలంగాణ అస్థిత్వాన్ని పాతర వెయ్యటమేనని అన్నారు.మన తెలంగాణ తల్లి మాత్రం బీదరాలిగా ఉండాలనే, రేవంత్ రెడ్డి ఫ్యూడాలిస్ట్ స్వభావం చాటుకున్నారని, దీన్ని తెలంగాణ సమాజం స్వీకరించరని అన్నారు. హస్తం గుర్తు చూపెట్టేలా ఉన్న ఈ ప్రతిమ ముమ్మాటికీ కాంగ్రెస్ తల్లి ల ఉన్నది తప్ప, తెలంగాణ తల్లి రూపానికి ఏ కోశాన సరిపోదని, తక్షణమే ఈ విగ్రహం నీ గాంధీ భవన్ కి తరలించుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now