Headlines
-
తెలంగాణ బయోసైన్స్ టీచర్స్ ఫోరం జగదేవపూర్ మండల శాఖ ఏకగ్రీవం ఎన్నిక
-
కే శ్రీశైలం, జి రఘురాములు తెలంగాణ బయోసైన్స్ టీచర్స్ ఫోరం కమిటీకి ఎన్నిక
-
జగదేవపూర్ మండలంలో బయోసైన్స్ టీచర్స్ ఫోరం ఎన్నికలు సునాయాసంగా ముగిశాయి
-
తెలంగాణ బయోసైన్స్ టీచర్స్ ఫోరం: కొత్త కమిటీ ఏర్పాటులో విజయవంతం
-
జీవశాస్త్ర ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కొత్త కమిటీ తెలిపింది
తెలంగాణ బయోసైన్స్ టీచర్స్ ఫోరం మండల శాఖ ఏకగ్రీవం ఎన్నిక
జగదేవపూర్ డిసెంబర్ 9 ప్రశ్న ఆయుధం :
తెలంగాణ బయోసైన్స్ టీచర్స్ ఫోరం జగదేవపూర్ మండల శాఖ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిధిలో జిల్లా పరిషత్ మోడల్ స్కూల్, కేజీబీవీ లలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయులు హాజరై ఇట్టి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. టీబీఎస్ఎఫ్ మండల అధ్యక్షులుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తీగుల్ కు చెందిన కే శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి గా జడ్పీహెచ్ఎస్ చాట్లపల్లికి చెందిన జి రఘురాములు ఎన్నికవ్వడం జరిగింది. కోశాధికారిగా గొల్లపల్లి పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా మునిగడప పాఠశాలకు చెందిన సుజాత, ఇటిక్యాల పాఠశాలకు చెందిన నాగరాజు సెక్రటరీలు గా సుస్మిత, శోభారాణి, రామకృష్ణ రామచంద్రం,హర్షవర్ధన్, స్వామి లు ఎన్నికయ్యారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ జీవశాస్త్రం ఉపాధ్యాయుల సమస్యలు సాధన కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామని తెలిపారు. తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.