సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ.

కాంగ్రెస్

సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ.

కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా కోరుట్ల మండల యూత్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అలాగే రోగులకు పండ్ల పంపిణి చేసారు. అనంతరం ఇంద్రాల హరీష్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్ల పోరాటాన్ని గౌరవించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, మన దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అన్నారు. సోనియా గాంధీకి మరొక్కసారి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ,కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమల్ల సత్యనారాయణ, మాజీ కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి,కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముక్కెర రాజేష్, మహమ్మద్ రిజ్వాన్ పాషా,యూత్ కాంగ్రెస్ నాయకులు సరికెళ్ళ నరేష్, మహమ్మద్ నసీర్, ఇంద్రాల అశోక్,రియాజ్,ఎడ్ల రమేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now