*పిల్లలకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తాం*
*జమ్మికుంట సీఐ వరగంటి రవి*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 8*
18 సంవత్సరాలు దాటని పిల్లలకు వాహనాలు ఇస్తే వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని జమ్మికుంట సిఐ వరగంటి రవి అన్నారు జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం పట్టణ సీఐ వరగంటి రవి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పట్టణంలో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలతో పాటు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు అనంతరం సిఐ మాట్లాడుతూ మైనర్ల (18 సంవత్సరాలు దాటని పిల్లలకు)కు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపిన కేసులు నమోదు చేస్తామని త్రిబుల్ రైడ్ చేస్తే పెనాల్టీ తో పాటు కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారికి వాహనాలు ఇవ్వకూడదని సిఐ తెలిపారు. గురువారం నిర్వహించిన తనిఖీల్లో సుమారు 60 వాహనాల వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వాహన యజమానులతో సిఐ మాట్లాడి నెంబర్ ప్లేట్ లేని వాహనదారులకు జరిమానా విధిస్తూ త్రిబుల్ రైడ్ చేసిన వారిని సైతం కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానా విధించారు. ఇంకొకసారి ఇలాంటివి పునరావృతం అయితే జరిమానాతో పాటు కేసు నమోదు చేసి జైలుకు పంపించాల్సి ఉంటుందని సిఐ వాహన యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఎస్సై టి వివేక్ తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.