ఇంటి ఖాళీ స్థలం విడిచి వెళ్లాలంటూ బెదిరింపులు

ఇంటి
Headlines
  • అశ్వరావుపేట దొంతికుంట చెరువు కబ్జా పై రైతుల వినతిపత్రం
  • రైతులు కోరిన దొంతికుంట చెరువు రక్షణపై కలెక్టర్ దర్యాప్తు చేపట్టాలని వినతిపత్రం
  • చేరువును రక్షించాలి, సాగునీరు, త్రాగునీరు అందించాలి – అశ్వరావుపేట రైతులు

 ఇంటి కాలి స్థలం విడిచి వెళ్లాలంటూ తమను తమ బంధువులను బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ వేలేరు మండలం ఎర్రవెల్లి తండాకు చెందిన భూక్య సమ్మయ్య ఆదివారం మీడియాతో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఎర్రబెల్లి తండాకు చెందిన భూక్య సమ్మయ్యకు ఎర్రబెల్లి తండాలో ఇంటి ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలాన్ని తన బంధువైన భూక్య సమ్మయ్య తండ్రి లాల్ కు ఇంటి స్థలం లేనందున తాత్కాలిక ఇంటి నిర్మాణం చేసుకొని ఉండుటకు ఆ స్థలాన్ని ఇవ్వడం అయినది. ఇటీవల ఆ స్థలం పక్కనే ఇల్లు ఉన్న భూక్యా రాజన్ అరుణ సాంబరాజు లకు భూక్య సమ్మయ్య తండ్రిలాల్ ల కుటుంబాల మధ్య తమ కూతురు భూక్య మౌనిక మరణ విషయంలో గొడవలు జరుగుతున్నవి. అది మనసులో పెట్టుకొని భూక్యరాజన్ కుటుంబ సభ్యులు తమకు ఫోన్ చేసి భూక్య సమ్మయ్య త డ్రి లాల్ అతని కుటుంబ సభ్యులను మా ఇంటి స్థలం నుండి ఖాళీ చేయించి పంపించండి లేదంటే ఆ భూమిని మాకు అమ్మండి లేదంటే కేసులు పెడతామంటూ పలుసార్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏమైనా ఉంటే నాతో సంయమనంగా మాట్లాడాలి కానీ తమ కూతురుని కోల్పోయి పుట్టేడు దుఃఖంలో ఉన్న భూక్య సమ్మయ్య తండ్రిలాల్ కుటుంబ సభ్యులను కేసులు పెడతామంటూ వేధింపులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు. స్థానిక మాజీ వార్డ్ మెంబర్ బానోతు శారద మాట్లాడుతూ భూక్య సమ్మయ్య కూతురు మౌనిక మరణ విషయంలో భూక్య సమ్మయ్య న్యాయం జరగక ఆవేదన చెందుతున్నారని రాజన్ అతని కుటుంబ సభ్యులు తమ ఇల్లును ధ్వంసం చేశారంటూ తప్పుడు కేసులు భూక్య సమ్మయ్య తండ్రిలాల్ మీద బనాయించడం అతను ఉంటున్న ప్రస్తుత తాత్కాలిక ఇంటిని కాళీ చేయించాలని బెదిరింపులకు పాల్పడడం సమంజసమైన విషయం కాదని ఆ ఇల్లుకు ఎటువంటి నష్టము జరగలేదని దానికి సాక్ష్యం ఎర్రబెల్లి తండావాసులము మేమంతా ఉన్నామని అన్నారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయాలని పత్రికముఖంగా తమ గూడు వెల్లబోసుకున్నారు ఈ పత్రిక సమావేశంలో ఎర్రవెల్లి తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now