కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పేరిట గుర్తుతెలియని దుండగులు వాట్సాప్ నకిలీ ఖాతాను తెరిచారు. కలెక్టర్ డిస్ప్లే పిక్చర్ని వినియోగిస్తూ డబ్బులు పంపాలంటూ కలెక్టరే ట్లోని ఏటీవోకు మెసేజ్ చేశారు. అప్రమత్తమైన కలెక్టరేట్ కార్యాలయ అధికారులు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దింతో కలెక్టరేట్ ఏవో సయ్యద్ అహ్మద్ మస్రూద్ కలెక్టర్ పేరిట దేవునిపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు దేవునిపల్లి పోలిస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..