పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం వాకిటి రాఘవేందర్ (31) రోజు మాదిరిగా నవంబర్ 31 న చిన్న గోల్కొండ లోని సబ్‌స్టేషన్‌ కు పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి ఇంటికి వెళ్ళలేడని, కుటుంబ సభ్యులు రాఘవేందర్ గురించి చిన్న గోల్కొండ లోని సబ్‌స్టేషన్‌ లో విచారించగ రాఘవేందర్ చిన్నగోల్కొండ గ్రామ పరిధిలోని పని స్థలం నుంచి వెళ్లిపోయాడని ఆ తర్వాత 09-12-2024 నాడు రాఘవేందర్ తో పాటు పని చేసే సహోద్యోగి దుర్గాప్రసాద్‌కు మెరిన్‌లైన్ రైల్వే స్టేషన్ నుండి అందిన సమాచారమేమనగా రాఘవేందర్ బ్యాగ్ రైలు లో కనిపించిందని, రాఘవేందర్ కు ఫోన్ ఎన్ని సార్లు చేసిన స్విచ్ ఆఫ్ వచ్చినట్లు తెలిపారున్నారు.గతంలో 3 నెలల క్రితం కూడ రాఘవేందర్ ఎవరితో చెప్పకుండ ఇంటి నుండి వెళ్లిపోయాడని కొన్ని రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చినట్లు తెలిపారు.తప్పిపోయిన వ్యక్తి ఎత్తు: 52″, రంగు: చామనచాయ, దుస్తులు: బ్లూ కలర్ ప్యాంటు, రెడ్ కలర్ షర్ట్ దరించాడని . తెలిపారు. తప్పు పోయిన వ్యక్తి నిమిత్తం కుటుంబ సభ్యులు చుట్టుపక్క ప్రాంతాలలో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించరని తెలిపారు. ఇట్టి విషయమై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment