నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

*నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన*

-శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ జ్యోతిర్వస్తు విద్యాపీఠాధిపతి డా. శ్రీమహేశ్వర శర్మ సిద్ధాంతి

*వట్టిపల్లి:- డిసెంబర్ 11

వట్టిపల్లి మండల పరిధిలోని మరవెళ్లి గ్రామం లో శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ప్రారంభ పూజా కార్యక్రమం గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.ఎన్నో ఏండ్ల ఆకాంక్షకు,కొన్ని సంవత్సరాల నీరిక్షణకు ఎట్టకేలకు నెరవేరబోతుందని సంతోషం వ్యక్తం చేశారు శ్రీ వీరభద్ర ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలియజేశారు.గ్రామంలో ని వీరశైవ లింగాయత్, ఆర్యవైష్యులు, విశ్వ బ్రాహ్మణులు మరియు ఇతర గ్రామస్తులు కలిసి వీరభద్రుడి గుడిని నిర్మించాలని తలచి అందరు కలిసి చందాలు వేసుకుని ఆలయ నిర్మాణం కు నాంది పలికి నేడు నిర్మాణం పనులను సిద్ధాంత కర్త అయినా శ్రీ జ్యోతిర్వస్తు విద్యాపీఠాధిపతి డా. శ్రీమహేశ్వర శర్మ సిద్ధాంతి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అయన స్వయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తుల సమక్షంలో నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో

గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment