ఆదమరిస్తే అంతే…?

ఆదమరిస్తే అంతే…

— ప్రమాదకరంగా రోడ్డు ప్రయాణం

–పట్టించుకోని పాలకులు, అధికారులు

— భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శిగూడూరు సందీప్

నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి మల్లంపల్లి రోడ్డు జాతీయ రహదారి 365 వెళ్ళే రహదారి దర్గాకు పక్కనే ఆనుకొని ఉన్న కల్వర్టు ఉన్నబడిన వర్షాలకు కోతకు గురైంది అధికారులు నామమాత్రంగా రిపేరు చేశారు, కానీ క్రమక్రమంగా కల్వర్టుపై ఉన్న కంకర మట్టి జారి కాలువలో పడిపోవడంతో ప్రమాదకరంగా మారింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు చీకట్లో కనిపించని గుంత కారణంగా చాలా వాహనాలు గుంతలో పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.

ఈ కల్వర్టు దగ్గర చాలా ప్రమాదాలు జరిగాయి, రోడ్డు ఇరుకుగా మారి పెద్ద పెద్ద వాహనాలు వస్తే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది ఈ మధ్యన ఒక లారీ కల్వర్టుపై రిపేరు వచ్చి ఆగిపోవడంతో గంట పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఇకనైనా అధికారులు కళ్ళు తెరచి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని నర్సంపేట పట్టణ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది .

Join WhatsApp

Join Now

Leave a Comment