వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో అక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక హామీలు ఇచ్చారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రి నేడు సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భ‌ద్ర‌కాళి చెరువు, విమానాశ్ర‌యం తదితర అంశాలపై ప్ర‌ధానంగా చర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ లను త్వరితగతిన తయారుచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డుతో జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని, ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న‌, భ‌ద్ర‌కాళి చెరువు శుద్ధీక‌ర‌ణ‌ ప‌నుల‌ను వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment