అమరావతి :
ప్రారంభమైన రెండవ రోజు కలెక్టర్ల సదస్సు
– వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాలులో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన సదస్సు
– ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు, వంటి అంశాలపై దిశానిర్ధేశం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
– రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చ
– 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగే సదస్సులో వారి అభిప్రాయాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి
– రెండవరోజు హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చర్చ
– ఈ సదస్సులో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు.