హిందూ మతంలో నాగ పంచమి పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లోని శుక్ల పక్షం ఐదవ రోజు న నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగ పంచమి 09 ఆగస్ట్ 2024 శుక్రవారం వచ్చింది. విశేషమేమిటంటే నాగ పంచమి రోజున ఏర్పడిన సధ్య, సిద్ధ యోగాలు ఈ రోజు ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి. పంచమి రోజు మధ్యాహ్నం 01:46 వరకు సిద్ధయోగం ఉంటుంది. ఆ తర్వాత సధ్య యోగం ప్రారంభమవుతుంది. పంచమితిథి ఎప్పుడుఆగస్ట్ 09వ తేదీ అర్ధరాత్రి 12:36 గంటలకు ప్రారం భమై ఆగస్ట్ 10వ తేదీ తెల్లవారుజామున 03:14 గంటలకు ముగుస్తుంది.
నాగ పంచమి పూజ సమయం*
నాగ పంచమి రోజున పూజకు అనుకూలమైన సమయం ఉదయం 05.46 నుండి 08.26 వరకు ఉంటుంది. పూజ వ్యవధి 02 గంటల 40 నిమిషాలు. నాగదేవతను పూజించేట ప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచు కోవాలి. నాగ పంచమి రోజున నాగదేవతను ఆరాధించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ రోజున నాగదేవత పూజలో పసుపును ప్రత్యేకంగా ఉప యోగించాలని నమ్ముతారు. ధూపం, దీపాలు, పూజా సామాగ్రి సమర్పించిన తర్వాత తీపి పదార్థాలు సమర్పించాలి