వయనాడ్ ఘటన ను విపత్తుగా ప్రకటించారు

కేరళ వాయినాడు ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య

సిద్దిపేట ఆగస్టు 9 ప్రశ్న ఆయుధం :

  • కేరళ వాయినాడు లో జరిగిన ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా కమిటీ పిలుపు మేరకు రానే బ్రేక్ లైనింగ్ పరిశ్రమలో కేరళ వాయునాడు బాధితులకు విరాళాలు సేకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ లో కురిసిన వర్షాలకు అర్ధరాత్రి సమయంలో కొండ చర్యలు విరిగిపడి మట్టి బండ రాళ్లు కొట్టుకొని వచ్చి రెండు గ్రామాలను పూర్తిగా ధ్వంసం చేసిందని దీంతో ఇండ్లు పంట పొలాలు తోపాటు నిద్రలోనే సుమారు 350 మందికి పైగా మరణించడం జరిగిందని, 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని అన్నారు మానవ సమాజం మానవ దృక్పథంతో స్పందించవలసిన విషయమని కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కేరళ ప్రభుత్వం కుటుంబాలను ఆదుకునేందుకు అనేక రూపాల్లో చర్యలు తీసుకుంటుందని కానీ కేంద్ర ప్రభుత్వం కనీసం కూడా స్పందించకపోవడం విచారకరమని అన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రానే పరిశ్రమ యూనియన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండ్ల స్వామి చంద్రశేఖర్ రెడ్డి రవికుమార్ రంగారెడ్డి మల్లయ్య రాజగోపాల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now