*పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి*
*డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి*
*జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 9*
డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఇల్లందకుంట మండలంలో 2024-2025 సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆవాల నరహరి మాట్లాడుతూ పీఆర్సీ గడువు ఇప్పటికే తీరిపోయిందని ప్రభుత్వం వెంటనే కమిటీ నివేదిక తెప్పించుకుని వెంటనే అమలు చేయాలని పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగే విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయించడం తీవ్ర నిరాశకు గురి చేసిందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా కార్యదర్శి ఏబూసి శ్రీనివాస్ మాట్లాడుతూ మోడెల్ స్కూల్ టీచర్ల జీతాలు రెండు మూడు నెలలకోసారి ఇస్తున్నారని దీనివల్ల మోడెల్ స్కూల్ టీచర్లు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం వెంటనే 010 పద్దు కింద జీతాలు కేటాయించి నెల నెలా జీతాలు ఒకటో తారీఖున ఇవ్వాలని కోరారు అలాగే మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేల్పుల రత్నం ఇల్లందకుంట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వేణు సంపత్‌లు పాల్గొన్నారు